మృగమదము తిలకమును నగు మొగముచెలువమును -నలఁతిపవడముఁ దెగడు నధరపుటము
వలుదజఘనములు బొలుపలరుకనకపువలువ -కలితకరచరణమణికటకములును
విరులతురుమును నమిలిపురిసొబగుమకరికము -రచన నెసఁగిన చెవుల రవణములును
కరకమలయుగళ ధృతి మురళియును ద్రివిధమగు -నిలుకడయు నిటలతటి నెఱయు కురులు
ధీరశ్రేష్ఠుల్సన్నుతింపం గవీంద్రా
ధారంబై ధాత్రిన్మతాగాగణాప్తిన్
దోరంబై భూభృద్యతుల్ సంఘటింపన్
నీరేజాక్షా శాలినీవృత్త మొప్పున్.
పందికై పోరాడ ఫాలాక్షుఁ డెవ్వని; బలమున నా కిచ్చెఁ బాశుపతము?
నెవ్వని లావున నిమ్మేన దేవేంద్రు; పీఠార్థమున నుండ బెంపుఁ గంటిఁ?
గాలకేయ నివాత కవచాదిదైత్యులఁ; జంపితి నెవ్వని సంస్మరించి?
గోగ్రహణము నాఁడు కురుకులాంభోనిధిఁ; గడచితి నెవ్వని కరుణఁ జేసి?