శ్రీదీపిక

మంగళవారం, నవంబర్ 13, 2007

 

ధ్యానం —నా సందేహాలు

ధ్యానం —నా సందేహాలు
నేను ఈ మధ్య (జూలై నెల నాటి మాట) స్వామి వివేకానంద రాసిన రాజయోగం పుస్తకం చదివాను.ఇందు లో జ్ఞానం,దేవుడు,మతం,మత ప్రవక్తల గురించి,వారు జ్ఞానం పొందిన విధానం(రాజ యోగం) గురించి రాశారు. ఈ పుస్తకాన్ని చదివి అర్ధం చేసుకోవడానికి కొంచం కష్టపడ్డాను.అసలు విషయానికి వస్తే ఈ పుస్తకం చివరి అధ్యాయం లో చెప్పిన కొన్ని వాక్యాలు అమితం గా ఆకట్టు కున్నాయి.
అవి
[..] నిద్రించే ముందు వ్యక్తి ఏ స్థితి లో వుంటాడో, నిద్రించి మేల్కొన్న తర్వాత కూడా అదే స్థితి లో వుంటాడు.నిద్రించేవరకూ అతని కెంత జ్ఞానం ఉంటుందో నిద్ర తర్వాత కూడా అదే స్థితి లో ఉంటాడు.అతని జ్ఞానం ఏ మాత్రం వికసించదు. అతనికెట్టి తత్వదర్శనం కలుగదు. కానీ సమాధి ని పొందిన యోగి విషయం అలా కాదు. సమాధిలోకి వెళ్ళే ముందు అతను మూర్ఖుడై ఉంటే, సమాధి తర్వాత అతను ఋషి గా మారిపోతాడు[…]ఈ విషయం గురించి గాఢం గా అలోచించాను. సడన్ గా ఒక రాత్రి మూడింటి కి మెళుకువ వచ్చింది.సబ్ - కాన్షియస్ మైండ్ ని ఆక్టివేట్ చెయ్యడమే ధ్యాన స్థితి/సమాధి అన్న విషయం స్ఫురించింది. అంతే నిజంగా మొదటి సారి నేను చెప్పలేని ఆనందాన్ని పొందాను.ఆ ఆనందాన్ని ఇప్పుడు మాటల లో చెప్పలేను. ఇప్పుడు పై విషయం కూడా నా సబ్ కాన్షియస్ మైండే చెప్పింది అన్న విషయం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. అంతకు ముందు ఒక పుస్తకం లో(పేరు గుర్తు లేదు. ఇంగ్లీషు పుస్తకం అది.) సబ్ -కాన్షియస్ మైండ్ ని ఎలా ఏక్టివేట్ చేసుకొవాలి అన్న విషయం చెప్పారు. అప్పటి నుండీ సమస్యలకు పరిష్కారా లు నిద్ర లో పొందాను.

తర్వాతి రోజు నుండీ ఈ విషయం గురించి ఆలోచించిన తర్వాత నాకు వచ్చిన సందేహాలు ఇవి.
1.నిజంగానే సబ్ కాన్షియస్ మైండ్ ని ఆక్టివేట్ చేయడమేనా ధ్యాన స్థితి / సమాధి స్థితి అంటే??
2.ధ్యాన/సమాధి స్థితి ని పొందే మార్గ్రం ఇదేనా? (రెండిటి మధ్యా చాలా బేధం ఉండవచ్చ్చు.)
3.లేదా నేను సరిగ్గా అర్ధం చేసుకోలేదా??

కొంత మందిని ఇదే విషయం అడిగాను. సరైన సమాధానం దొరక లేదు. ఒకాయన సబ్ - కాన్షియస్ మైండ్ నుండీ పొందే పరిష్కారాలు మాత్రం గొప్పగా వుంటాయి అని.
ఇదే పుస్తకం లో స్వామి చెప్పిన మరికొన్ని వాక్యాలు

[..] ప్రపంచం లో ని గొప్ప ప్రవక్తలంతా "మాకు లభించిన తత్వసిధ్ధాంతాలన్నీ పైనించే వచ్చాయి." అని వారంతా అంటారు.అయితే అవి వారికి నిజం గా ఎక్కడి నుండీ ప్రాపించాయో ,వారి లో చాలా మంది కి తెలియదు.(రెక్కలతో ఎగిరి వచ్చిన దేవదూత లేదా దేవత చెప్పిందని వారు అన వచ్చు.) హేతు ప్రజ్ఞ తో గానీ,తర్కం తో గానీ తమకీ దివ్యజ్ఞానం కలుగలేదని వీరంతా ఏకీభవించవచ్చు గాక.
"వారికి ప్రాప్తించిన దివ్య జ్ఞానం హేతువాదానికి అతీతమే, అయితే ఈ జ్ఞానం అంతర్గతం నుండే వస్తున్నది." -యోగశాస్త్రం. [..]
[..]అతీంద్ర్రీయ జ్ఞానాన్ని సాధించడమే మతం.[..]
[..]ఒక పుస్తకం లొ బ్రహ్మజ్ఞానమంతా ఉందనటం,ఈశ్వరుడిని నిందించడమే!భగవంతుడు అప్రమేయుడు,అనంతుడు అంటూనే, అతన్ని ఒక చిన్న పుస్తకం లో ఇరికించడం ఎంత అవివేకం![..]
[..]వెలుపల లేదా లోపల ఒక లక్ష్యం మీద మనసును నిలిపితే,చిత్తం ఆ లక్ష్యం లో అవిచ్చన్నంగా ఉండిపోతుంది.దీన్నే ధ్యానం అంటాం. ప్రతీదీ లేదా ఇంద్రియానుభవం లోని బాహ్యాంశాన్ని తొలగించి,అంతరాంశమైన అర్ధాన్ని మాత్రమే ధ్యానించగలిగే తీవ్ర శక్తి మనసుకు ఏర్పడితే అది సమాధి అవుతుంది.[..](ఇది సరిగ్గా అర్ధం కాలేదు.)
[..]సమాధి ని పొంధాలంటే శాస్త్రీయంగా సాధన చేయాలి.[..]

రిఫరెన్సులు:
1.రాజ యోగం-స్వామి వివేకానంద(ISBN 81-7120-744-8)
https://www.sriramakrishnamath.org/ వెబ్ సైట్ ద్వారా కూడా ఆర్డరు చేయవచ్చు.

వెల:Rs.15/- మాత్రమే.(మార్చి 2007 నాటికి)
2.Unknown Book
3.My Personal Experiences.

నా సందేహాల కు సమధానాలు దొరుకుతాయని ఆశిస్తూ
దిలీపు మిరియాల



--
Dileep.M
E-mail:      m.dileep@gmail.com,
Phone:     +91- 9926 33 44 64.
WebSite:   http://mdileep.googlepages.com
Blog:         http://mdileep.wordpress.com

కామెంట్‌లు:
"ప్రతీదీ లేదా ఇంద్రియానుభవం లోని బాహ్యాంశాన్ని తొలగించి,అంతరాంశమైన అర్ధాన్ని మాత్రమే ధ్యానించగలిగే తీవ్ర శక్తి మనసుకు ఏర్పడితే "

సాయి లీలామృతం లో చదివాను. ఒకసారి నానా చందోర్కరు సాయి సన్నిధి లో ఉన్నప్పుడు ఇద్దరు ముస్లిం స్త్రీలు ద్వారకామాయి కి వస్తారు. సాయి సన్నిధి లో వారు ముసుగు ను తొలగించగానే, వారి సౌందర్యాన్ని చూసి నానా మనసు చలిస్తుంది. వెంటనే సాయి నానా భుజం తట్టి, వాళ్ళు వెళ్ళిపోయాక చెప్తారు కద, అందమైన దేవాలయాలు ఎన్ని లేవు. మనం బాహ్య సౌందర్యాన్ని కాక ఆ అందాన్ని కల్పించిన దైవ లీలను చూడాలి అని.
అంతరాంశమైన అర్ధాన్ని గుర్తించడం అంటే ఇదేనేమో.
 
కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]





<< హోమ్

ఆర్కైవ్‌లు

జులై 2007   ఆగస్టు 2007   సెప్టెంబర్ 2007   నవంబర్ 2007   డిసెంబర్ 2007   అక్టోబర్ 2014  

This page is powered by Blogger. Isn't yours?

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి పోస్ట్‌లు [Atom]


Visitors