నేను మొబైల్ బ్రౌజింగ్ మూడు సంవత్సరాల నుండీ చేస్తున్నా.నేను బ్రౌజింగ్ మొదలు పెట్టినప్పుడు తెలుగు ని సపోర్ట్ చేసే మొబైల్స్ చాలా తక్కువ ఉండేవి/ అందుబాటు లో ఉండేవి కాదు.(విండోస్ మొబైల్స్ తప్పా వాటి ధర ౩౦ వేల కి తక్కువ ఉండేది కాదు.) అపట్లో మొబైల్ బ్రౌజింగు కూడా చాలా తలనొప్పి గా ఉండేది. మొబైల్ బ్రౌజర్స్ WAP సపోర్ట్ మాత్రమే ఉండేది.ఇప్పటి బ్రౌజర్లు HTML/XHTML/WAP ని కూడా చక్కగా హేండిల్ చేస్తున్నాయి. ఇది గతం.
మొబైల్స్ రేట్లు తగ్గీ, యునీకోడ్ సపోర్ట్ వల్ల తెలుగు ని మొబైల్స్ లో చూడగలుగు తున్నాము. తెలుగు లో వ్రాయగలుగు తున్నాము. ఇప్పుడు SMS కి కూడా యునీకోడ్ సపోర్ట్ ఉండడం వల్ల తెలుగు లో కూడా పంపవచ్చు. కానీ మీ మొబైల్ లో తెలుగు ఫాంటు ఉండాలి అంతే.
నేను రోజూ కూడలి ని మొబైల్ లో చదువుతాను.ఈనాడు,ఆంధ్రజ్యోతీ,దట్స్ తెలుగూ,యాహూ,రెడిఫ్ సైట్ల RSS ఫీడ్లు తో వార్తలు అప్ డేట్ చేసుకుంటాను.
ఈ-మెయిలు చెక్ చేసుకోవడం , పంపడం లాంటి వన్నీ.
ఇక బ్లాగుల విషయానికి వస్తే
- వర్డ్ ప్రెస్ లో m.wordpress.com నుండీ బ్లాగ్ ల స్టాటస్టిక్స్ మరియూ పోస్టింగ్ చేయవచ్చు.
- ఇక బ్లాగరు లో మీరు అల్రెడీ ఆటోపోస్టింగ్ కి మీ ఈ-మైయిలు సెట్ చేసి ఉంటే డైరెక్టు గా మెయిలు నుండే కొత్త పోస్ట్ మీ బ్లాగులో రెడీ.
GPRS పట్ల అవేర్ నెస్ ఇంకా జనాలకి తెలియదు.
కొన్ని బ్రౌజింగ్ టిప్స్
- ఇమేజ్స్ ని ఆఫ్ చేయండి. (బ్యాండ్ విడ్త్ తగ్గించుకోవచ్చు.)
- m.mowser.comలాంటి సైట్ లు ఉపయోగించుకోవచ్చు. ఇది ఇమేజ్స్ ని కూడా చాలా చక్కగా మొబలైజ్ చేసి చూపిస్తుంది.
- ఫీడ్ల ని చదవడానికి కూడా పై సైటు ఉపయోగించుకోవచ్చు. లేదా గూగిల్ రీడర్ ని ఉపయోగించుకోవచ్చు.
- బుక్ మార్క్స్ లేదా డైరెక్ట్ యూ.ఆర్ .ఎల్ . ని ఉపయోగించడం వల్ల సమయం వృధా కాదు.
- మీ బ్రౌజర్ ఎంత ని సపోర్ట్ చేసినా వాప్ సైట్ ల ని లేదా మొబైల్ వెర్షన్స్ ని ఉపయోగించడానికి try చేయండి.
ఆపరేటర్ల గురించి
ఎయిర్ టెల్ లో రెండు రకాల పధకాలు ఉన్నాయి
- నెలకూ ౯౯ (99)రూపాయలు అన్ లిమిటెడ్.
- రోజు కూ ౧౫ (15)రూపాయలు స్పీడ్ ఎక్కువ. (మీరు అనుకునేంత కాదు.).మీ పీసీ కి కూడా కనెక్టు చేసుకోవచ్చు.
ఐడియా లో
- ఒక్కో కేబీ కీ రెండు పైసలు. (నా మెయిలు చూస్తే నాకు 20(౨౦) పైసలు ఖర్చు.(ఇమేజ్ లు లేకుండా.) )
హచ్,బీ.ఎస్ .ఎన్. ఎల్ లో నాకు తెలియదు.
ఇప్పుడు మొబైల్ బ్రౌజర్స్ లో ఒపేరా మినీ ని మించింది లేదు.(విండోస్ మొబైల్స్ ని మినహాయిస్తే. ఇది నా అనుభవం.) ఒపేరా మినీ లో జావాస్క్రిప్ట్ కూడా చక్కగా పని చేస్తుంది.(మొబైల్ లో జావా స్క్రిప్ట్ కి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.) లేఅవుట్,టేబుల్స్ ని చాలా చక్కగా చూపిస్తోంది.మొబైల్స్ కి ప్రిఫరబుల్ బ్రౌజర్.
(ఇది నా కామెంటు ఇక్కడ http://praveengarlapati.blogspot.com/2007/09/blog-post_08.html)
కొసమెరుపు:
ఏది ఏమైనా మొబైల్ బ్రౌజింగ్ కి కొంత ఓపిక కావాలి.
--
Dileep.M
E-mail:
m.dileep@gmail.com,
Phone: +91- 9926 33 44 64.
WebSite:
http://mdileep.googlepages.comBlog:
http://mdileep.wordpress.com
Changes in the File ITextHandler.cs public override void Characters(string content, int start, int length)
{ [...] if (bf == null)
{BaseFont bfComic = BaseFont.CreateFont ("c://windows//Fonts//ARIALUNI.ttf",BaseFont.IDENTITY_H,BaseFont.EMBEDDED);
iTextSharp.text.Font font = new iTextSharp.text.Font(bfComic, 12);
currentChunk = new Chunk(buf.ToString(), font);
}
[...]}
On 19th Jan 2006.
--
Dileep.M
E-mail: m.dileep@gmail.com ,
Phone: +91- 9926 33 44 64.
WebSite: http://mdileep.googlepages.com
Blog: http://mdileep.wordpress.com