నేను మొబైల్ బ్రౌజింగ్ మూడు సంవత్సరాల నుండీ చేస్తున్నా.నేను బ్రౌజింగ్ మొదలు పెట్టినప్పుడు తెలుగు ని సపోర్ట్ చేసే మొబైల్స్ చాలా తక్కువ ఉండేవి/ అందుబాటు లో ఉండేవి కాదు.(విండోస్ మొబైల్స్ తప్పా వాటి ధర ౩౦ వేల కి తక్కువ ఉండేది కాదు.) అపట్లో మొబైల్ బ్రౌజింగు కూడా చాలా తలనొప్పి గా ఉండేది. మొబైల్ బ్రౌజర్స్ WAP సపోర్ట్ మాత్రమే ఉండేది.ఇప్పటి బ్రౌజర్లు HTML/XHTML/WAP ని కూడా చక్కగా హేండిల్ చేస్తున్నాయి. ఇది గతం.
మొబైల్స్ రేట్లు తగ్గీ, యునీకోడ్ సపోర్ట్ వల్ల తెలుగు ని మొబైల్స్ లో చూడగలుగు తున్నాము. తెలుగు లో వ్రాయగలుగు తున్నాము. ఇప్పుడు SMS కి కూడా యునీకోడ్ సపోర్ట్ ఉండడం వల్ల తెలుగు లో కూడా పంపవచ్చు. కానీ మీ మొబైల్ లో తెలుగు ఫాంటు ఉండాలి అంతే.
నేను రోజూ కూడలి ని మొబైల్ లో చదువుతాను.ఈనాడు,ఆంధ్రజ్యోతీ,దట్స్ తెలుగూ,యాహూ,రెడిఫ్ సైట్ల RSS ఫీడ్లు తో వార్తలు అప్ డేట్ చేసుకుంటాను. ఈ-మెయిలు చెక్ చేసుకోవడం , పంపడం లాంటి వన్నీ.
ఇక బ్లాగుల విషయానికి వస్తే
వర్డ్ ప్రెస్ లో m.wordpress.com నుండీ బ్లాగ్ ల స్టాటస్టిక్స్ మరియూ పోస్టింగ్ చేయవచ్చు.
ఇక బ్లాగరు లో మీరు అల్రెడీ ఆటోపోస్టింగ్ కి మీ ఈ-మైయిలు సెట్ చేసి ఉంటే డైరెక్టు గా మెయిలు నుండే కొత్త పోస్ట్ మీ బ్లాగులో రెడీ.
GPRS పట్ల అవేర్ నెస్ ఇంకా జనాలకి తెలియదు. కొన్ని బ్రౌజింగ్ టిప్స్
ఇమేజ్స్ ని ఆఫ్ చేయండి. (బ్యాండ్ విడ్త్ తగ్గించుకోవచ్చు.)
m.mowser.comలాంటి సైట్ లు ఉపయోగించుకోవచ్చు. ఇది ఇమేజ్స్ ని కూడా చాలా చక్కగా మొబలైజ్ చేసి చూపిస్తుంది.
ఫీడ్ల ని చదవడానికి కూడా పై సైటు ఉపయోగించుకోవచ్చు. లేదా గూగిల్ రీడర్ ని ఉపయోగించుకోవచ్చు.
బుక్ మార్క్స్ లేదా డైరెక్ట్ యూ.ఆర్ .ఎల్ . ని ఉపయోగించడం వల్ల సమయం వృధా కాదు.
మీ బ్రౌజర్ ఎంత ని సపోర్ట్ చేసినా వాప్ సైట్ ల ని లేదా మొబైల్ వెర్షన్స్ ని ఉపయోగించడానికి try చేయండి.
ఆపరేటర్ల గురించి ఎయిర్ టెల్ లో రెండు రకాల పధకాలు ఉన్నాయి
నెలకూ ౯౯ (99)రూపాయలు అన్ లిమిటెడ్.
రోజు కూ ౧౫ (15)రూపాయలు స్పీడ్ ఎక్కువ. (మీరు అనుకునేంత కాదు.).మీ పీసీ కి కూడా కనెక్టు చేసుకోవచ్చు.
ఐడియా లో
ఒక్కో కేబీ కీ రెండు పైసలు. (నా మెయిలు చూస్తే నాకు 20(౨౦) పైసలు ఖర్చు.(ఇమేజ్ లు లేకుండా.) )
హచ్,బీ.ఎస్ .ఎన్. ఎల్ లో నాకు తెలియదు.
ఇప్పుడు మొబైల్ బ్రౌజర్స్ లో ఒపేరా మినీ ని మించింది లేదు.(విండోస్ మొబైల్స్ ని మినహాయిస్తే. ఇది నా అనుభవం.) ఒపేరా మినీ లో జావాస్క్రిప్ట్ కూడా చక్కగా పని చేస్తుంది.(మొబైల్ లో జావా స్క్రిప్ట్ కి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.) లేఅవుట్,టేబుల్స్ ని చాలా చక్కగా చూపిస్తోంది.మొబైల్స్ కి ప్రిఫరబుల్ బ్రౌజర్. (ఇది నా కామెంటు ఇక్కడ http://praveengarlapati.blogspot.com/2007/09/blog-post_08.html)
ధ్యానం —నా సందేహాలు నేను ఈ మధ్య (జూలై నెల నాటి మాట) స్వామి వివేకానంద రాసిన రాజయోగం పుస్తకం చదివాను.ఇందు లో జ్ఞానం,దేవుడు,మతం,మత ప్రవక్తల గురించి,వారు జ్ఞానం పొందిన విధానం(రాజ యోగం) గురించి రాశారు. ఈ పుస్తకాన్ని చదివి అర్ధం చేసుకోవడానికి కొంచం కష్టపడ్డాను.అసలు విషయానికి వస్తే ఈ పుస్తకం చివరి అధ్యాయం లో చెప్పిన కొన్ని వాక్యాలు అమితం గా ఆకట్టు కున్నాయి. అవి [..] నిద్రించే ముందు వ్యక్తి ఏ స్థితి లో వుంటాడో, నిద్రించి మేల్కొన్న తర్వాత కూడా అదే స్థితి లో వుంటాడు.నిద్రించేవరకూ అతని కెంత జ్ఞానం ఉంటుందో నిద్ర తర్వాత కూడా అదే స్థితి లో ఉంటాడు.అతని జ్ఞానం ఏ మాత్రం వికసించదు. అతనికెట్టి తత్వదర్శనం కలుగదు. కానీ సమాధి ని పొందిన యోగి విషయం అలా కాదు. సమాధిలోకి వెళ్ళే ముందు అతను మూర్ఖుడై ఉంటే, సమాధి తర్వాత అతను ఋషి గా మారిపోతాడు[…]ఈ విషయం గురించి గాఢం గా అలోచించాను. సడన్ గా ఒక రాత్రి మూడింటి కి మెళుకువ వచ్చింది.సబ్ - కాన్షియస్ మైండ్ ని ఆక్టివేట్ చెయ్యడమే ధ్యాన స్థితి/సమాధి అన్న విషయం స్ఫురించింది. అంతే నిజంగా మొదటి సారి నేను చెప్పలేని ఆనందాన్ని పొందాను.ఆ ఆనందాన్ని ఇప్పుడు మాటల లో చెప్పలేను. ఇప్పుడు పై విషయం కూడా నా సబ్ కాన్షియస్ మైండే చెప్పింది అన్న విషయం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. అంతకు ముందు ఒక పుస్తకం లో(పేరు గుర్తు లేదు. ఇంగ్లీషు పుస్తకం అది.) సబ్ -కాన్షియస్ మైండ్ ని ఎలా ఏక్టివేట్ చేసుకొవాలి అన్న విషయం చెప్పారు. అప్పటి నుండీ సమస్యలకు పరిష్కారా లు నిద్ర లో పొందాను.
తర్వాతి రోజు నుండీ ఈ విషయం గురించి ఆలోచించిన తర్వాత నాకు వచ్చిన సందేహాలు ఇవి. 1.నిజంగానే సబ్ కాన్షియస్ మైండ్ ని ఆక్టివేట్ చేయడమేనా ధ్యాన స్థితి / సమాధి స్థితి అంటే?? 2.ధ్యాన/సమాధి స్థితి ని పొందే మార్గ్రం ఇదేనా? (రెండిటి మధ్యా చాలా బేధం ఉండవచ్చ్చు.) 3.లేదా నేను సరిగ్గా అర్ధం చేసుకోలేదా??
కొంత మందిని ఇదే విషయం అడిగాను. సరైన సమాధానం దొరక లేదు. ఒకాయన సబ్ - కాన్షియస్ మైండ్ నుండీ పొందే పరిష్కారాలు మాత్రం గొప్పగా వుంటాయి అని. ఇదే పుస్తకం లో స్వామి చెప్పిన మరికొన్ని వాక్యాలు
[..] ప్రపంచం లో ని గొప్ప ప్రవక్తలంతా "మాకు లభించిన తత్వసిధ్ధాంతాలన్నీ పైనించే వచ్చాయి." అని వారంతా అంటారు.అయితే అవి వారికి నిజం గా ఎక్కడి నుండీ ప్రాపించాయో ,వారి లో చాలా మంది కి తెలియదు.(రెక్కలతో ఎగిరి వచ్చిన దేవదూత లేదా దేవత చెప్పిందని వారు అన వచ్చు.) హేతు ప్రజ్ఞ తో గానీ,తర్కం తో గానీ తమకీ దివ్యజ్ఞానం కలుగలేదని వీరంతా ఏకీభవించవచ్చు గాక. "వారికి ప్రాప్తించిన దివ్య జ్ఞానం హేతువాదానికి అతీతమే, అయితే ఈ జ్ఞానం అంతర్గతం నుండే వస్తున్నది." -యోగశాస్త్రం. [..] [..]అతీంద్ర్రీయ జ్ఞానాన్ని సాధించడమే మతం.[..] [..]ఒక పుస్తకం లొ బ్రహ్మజ్ఞానమంతా ఉందనటం,ఈశ్వరుడిని నిందించడమే!భగవంతుడు అప్రమేయుడు,అనంతుడు అంటూనే, అతన్ని ఒక చిన్న పుస్తకం లో ఇరికించడం ఎంత అవివేకం![..] [..]వెలుపల లేదా లోపల ఒక లక్ష్యం మీద మనసును నిలిపితే,చిత్తం ఆ లక్ష్యం లో అవిచ్చన్నంగా ఉండిపోతుంది.దీన్నే ధ్యానం అంటాం. ప్రతీదీ లేదా ఇంద్రియానుభవం లోని బాహ్యాంశాన్ని తొలగించి,అంతరాంశమైన అర్ధాన్ని మాత్రమే ధ్యానించగలిగే తీవ్ర శక్తి మనసుకు ఏర్పడితే అది సమాధి అవుతుంది.[..](ఇది సరిగ్గా అర్ధం కాలేదు.) [..]సమాధి ని పొంధాలంటే శాస్త్రీయంగా సాధన చేయాలి.[..]
ఇది తరువాతి తరం వెబ్/డెస్క్ టాప్ పేపరు.ఇప్పుడు పీడీఎఫ్ మరియూ ఫ్లాష్ లు ఎంత పాపులర్ / భాగం అయ్యాయో దీనికి కూడా అంత సత్తా వుంది. నిజం చెప్పాలంటే ఇది పీడీఎఫ్ మరియూ ఫ్లాష్ ల మేలు కలయిక(hybrid Technology of Flash and Pdf). ఇది హైబ్రీడ్ టెక్నాలజీ కావడం వల్ల పీడీఎఫ్, ఫ్లాష్ కి ఉన్న ఉపయోగాలు రెండూ ఉన్నాయి. డాక్యుమెంట్లు చదువు కోవడం, ప్రింటు తీసు కోవడం,ఫుల్ స్క్రీన్ , డాక్యుమెంట్లు Embed/షేరింగ్ చేసుకోవడం వంటి అన్ని ఆప్షన్లూ ఉన్నాయి. ఫైల్ Extension: .swf ఇప్పుడు ఎవరు ఎవరు ఈ ఫ్లాష్ పేపర్ల ని అందిస్తున్నారు/ఉపయోగిస్తున్నారు:
Scribd.com గురుంచి కొంత ఈ సైట్ లో ఆన్ లైన్ లో ఫ్లాష్ పేపర్లు తయారు చేసుకోవచ్చు. మన వధ్ధ ఉన్నా .pdf, .doc, .ppt, .xls, .txt, .odt, .odp ఫైల్స్ ను ఫ్లాష్ పేపర్ల లా మార్చుకోవచ్చు. ఒక ఫార్మేట్ లో ఉన్న డాక్యుమెంటుని మరో ఫార్మేట్ లో కి మార్చుకోవచ్చు. ఇంకా .mp3 గా వినవచ్చు(ఈ టెక్నాలజీ Adobe Pdf Reader 6.0 నుండీ ఉన్నదే). అడోబ్ ఒక ప్లగ్ ఇన్ అందిస్తోంది. దానితో .doc లను ఫ్లాష్ పేపర్ల గా మార్చుకోవచ్చు.
Google వాడు Indic Translation మొదలు పెట్టాడు. దీనితో వెబ్ ఆధారితమైన మరో భారతీయ భాషలు వ్రాసే పరికరం లభించింది అన్నమాట. (ప్రస్తుతం హిందీ మాత్రమే . తెలుగు / ఇతర భాషలకు మాత్రం On-Screen Keyboard లభిస్తోంది.) తెలుగు బ్లాగర్ల కు ఇది ఏమి గొప్ప విషయం కాదు కానీ దీని వల్ల తెలుగు/భారతీయ భాషలు రాసే వాళ్ళు పెరగవచ్చు. అన్ని పెద్ద పెద్ద సైట్లు Globalisation నుండీ Localisation వైపు పరిగెడుతున్నాయి. మార్కెట్ పెంచుకోవడానికి/ సామాన్య ప్రజలకు టెక్నాలజీ ఫలాలు అందడానికి ఇవి అన్ని తప్పవు. ఇంకా తెలుగు/భారతీయ భాషలు కంప్యూటర్ లో చూడవచ్చు/రాయవచ్చు అని తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది వున్నారు. తెలిసిన వాళ్ళు ఇంకా కూడలి లేదా వెబ్ ఆధారిత మరి ఇతర మాధ్యమాలు వాడడం నాకు ఆశ్చర్యం కలిగించే విషయం. మనం తెలుగు/భారతీయ భాషలు రాయడానికి ఇంగ్లీషు మీద ఆధారపడడం నిజం గా నాకు ఆశ్చర్యం కలిగించే మరో విషయం. References:
నిన్న Flickr లో నా 15Aug టూర్ ఫొటోలు అప్ లోడ్ చేస్తుండగా ఒక కొత్త ఫీచర్ గమనించాను. అది ఒకే సారి బోలెడు ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతే కాదు వాటి అప్ లోడ్ స్టేటస్ కూడా కనిపిస్తోంది. ఇది నిజం గా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పటి వరకు మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేసేందుకు Control లేదు(Desktop Applications లో మాత్రమే FilesList Control ని Acess చెయ్యవచ్చు.) . దీని మీద ఒక గంట గూగులింగు & Reserve Engineering టెక్నిక్స్ వుపయోగించిన తరువాత తెలిసిన/అర్ధమైన విషయాలు ఇవి: వుపయోగించిన Technologies : Flash,JavaScript,Ajax. ౧.ఫ్లాష్ తో FileList Control Acess చేయవచ్చు కాబట్టి దానిని వుపయోగించి Multiple Files Selection సాధ్యం అయ్యేలా చేశారు. ౨.ఒక సారి ఫైల్స్ కి రిఫరెన్స్ దొరికిన తరువాత ఇంకే ముంది ఏమైనా చేయవచ్చు. అలా Status bar Ajax తో తయారు చేశారు. ౩. ఒక వేళ JavaScript లేక పోతే (ఆఫ్ చేసి వున్నా) బేసిక్ ఫైల్ అప్ లోడర్ కి రీడైరక్ట్ అయ్యిపోతుంది.(ఇది Hyper Link మాత్రమే) .కాని JavaScript వుంటే మనకు కనిపించే లింక్ వర్క్ కాకుండా FileList Control open అవుతుంది.(ఇది ఆ hyper link path dynamic గా change చెయ్యడం వల్ల సాధ్యం అయ్యింది. ) ౪. మరో గొప్ప విషయం ఏమిటంటే దీనికి అంతటికి కారణ మైన Flash Object కనిపించదు. (http://flickr.com/images/upload/yuploadcomponent.swf ) కాబట్టి ఇక ముందు అన్ని సైట్ల లోను మల్టిపుల్ ఫైల్ సెలక్షన్ చూస్తాం . అలా Yahoo(Flickr) మరో శకానికి తెరతీసింది. మీ అభిప్రాయాలు తెలియ చేయగలరు. References: 1.http://www.devpro.it/FileReference/ 2..http://flickr.com/photos/upload/ 3.http://ajaxian.com/archives/flickrs-new-file-uploader -- Dileep.M E-mail: m.dileep@gmail.com, Phone: +91- 9926 33 44 64. WebSite: http://mdileep.googlepages.com Blog: http://mdileep.blogspot.com